హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కోదండ రామాలయ గదులకు వేలం

PDPL: గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలోని ఐదు గదులను మూడేళ్లకు అద్దెకు ఇచ్చేందుకు సోమవారం (నవంబర్ 23) బహిరంగ వేలం, టెండర్ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ బి. సదయ్య ఆదివారం తెలిపారు. బిడ్డర్లు గదికి రూ.30 వేల డిపాజిట్ చెల్లించాలి. టెండర్ ఫారాలు ఆలయ కార్యాలయంలో మధ్యాహ్నం 12 వరకు లభిస్తాయి. వేలం 12.30కు మొదలవుతుందన్నారు.