హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలియో చుక్కలు వేసిన మాజీ కార్పొరేటర్

RR: BN రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల, బస్తీ దవాఖానా, యూపీహెచ్‌సీ, డీపీఎస్ స్కూల్ కేంద్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.