SDPT: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి దివంగత మాజీ మంత్రి అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19న సిద్దిపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చొంగ్తూ జీవో నంబర్ 178 జారీ చేశారు.
తెలంగాణ
సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు


