హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆట వస్తువుల తరలింపుపై విచారణ జరపాలి'

MNCL: మంచిర్యాల బైపాస్ రోడ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థుల ఆట వస్తువులు తరలించడంపై సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎవరి అనుమతితో రాత్రి వేళ ఆట వస్తువులు తరలించారని ప్రశ్నించారు. ఆట వస్తువుల కొనుగోలు, కేటాయింపు, రవాణా, పంపిణీపై స్పష్టత ఇవ్వాలన్నారు.