హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్.వెంకటాపూర్‌లో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

MDK: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్‌లో సర్పంచ్ ఉమసంజీవరెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, నమోదు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.