హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: KTRపై MLA నాయిని ఘాటు విమర్శలు

వరంగల్ పర్యటనకు వస్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆదివారం వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గతంలో వరద బాధితులకు రూ.10 వేల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేటీఆర్ వరంగల్‌లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.