హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఈశాన్య పర్యాటకానికి ప్రధాని మోదీయే అంబాసిడర్‌’

అరుణాచల్ ప్రదేశ్ కోఆపరేటివ్ విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరణ, అవార్డుల వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఈశాన్య పర్యాటకానికి ప్రధాని మోదీయే అతిపెద్ద అంబాసిడర్‌గా నిలిచారన్నారు. ప్రకృతి అందాలను కాపాడుతూనే పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. గతంలో రూ.12 వేల కోట్లుగా ఉన్న అరుణాచల్ బడ్జెట్, 12 ఏళ్ల తమ పాలనలో రూ.36 వేల కోట్లకు చేరడమే ప్రగతికి నిదర్శనమన్నారు.