హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా నమోదు తీరును పరిశీలించిన కలెక్టర్

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల పేర్ల నమోదు ప్రక్రియను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.