హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరచింతలో తాగునీటి ఎద్దడి

WNP: అమరచింత మున్సిపాలిటీ 9వ వార్డులో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని వార్డు కౌన్సిలర్ విష్ణువర్ధన్ తెలిపారు. కాలనీలో బోర్ చెడిపోవడం వల్ల కాలనీవాసులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, మున్సిపాలిటీ నుంచి కాలనీలో ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. తాగునీటి కోసం కాలనీవాసులు ఇబ్బంది పడొద్దని, తక్షణ చర్యలు చేపట్టినట్లు విష్ణువర్ధన్ తెలిపారు.