హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసికందు వైద్యంలో నిర్లక్ష్యంపై ఆరోపణలు

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చుక్కాపూర్‌కు చెందిన భాగ్యలక్ష్మికి నాలుగు రోజుల క్రితం ఆడపిల్ల జన్మించింది. చిన్నారి 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నా సిబ్బంది స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం చిన్నారిని ఆదివారం HYD లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.