KRNL: ఆదోని పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాండవగల్లు గ్రామానికి చెందిన మహేశ్, నాగరాజు ఆదోని నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా, నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనతో పాండవగల్లు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


