హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని వ్యక్తి మృతి

CTR: యాదమరి మండలం మోర్దనపల్లి సమీపంలో అమరరాజా ఫ్యాక్టరీ ప్రాంగణంలోని మామిడి తోటలో వ్యక్తి ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుఖ్రామ్ ఓరాన్ (కూలీ)గా గుర్తించారు. కూలీల కోసం వెతుకుతున్న సమయంలో మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.