హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సహజ ప్రసవంపై వైద్యుల అవగాహన

కడప నగరంలో TNAI ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సహజ ప్రసవంపై దేశవ్యాప్త అవగాహన నడక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్గొని సహజ ప్రసవం వల్ల తల్లీబిడ్డలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. సహజ ప్రసవం తల్లి త్వరగా కోలుకోవడానికి, శిశువు ఆరోగ్యానికి దోహదపడుతుందని అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణీ వైద్యుల సలహా మేరకు ప్రసవ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు.