హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వైరల్ జ్వరాల విజృంభణ

PPM: సీతంపేట, పాలకొండ ప్రాంతీయాసుపత్రులు, జిల్లా ఆసుపత్రిలో మూడు వారాల్లో 2,080 వైరల్ జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1 నుంచి 19 వరకు జిల్లా ఆసుపత్రిలో 138 మంది జ్వర బాధితులు చేరి చికిత్స పొందారు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్యులు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో గిరిజనులు, చిన్నారులు, వృద్ధులు అధికంగా ఉన్నారు.