హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోమల నివారణకు డ్రైనేజీల శుభ్రత చర్యలు

NTR: విజయవాడ సింగ్ నగర్‌లో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వందనం బాబు తెలిపారు. ఆదివారం ఆఫీస్ ప్రాంతంలో పర్యటించి, సైడ్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్, వ్యర్థాలను తొలగించి నీటి పారుదల సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు.