హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కిరెడ్డిపల్లెలో 16 పంచాయతీలు ఏకగ్రీవం

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లోనూ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 14 పంచాయతీలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, మరో రెండు పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ పోటీ లేకుండా ఎన్నికలు ముగియడం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.