హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డు సభ్యుడిగా రాజుబాబు ఏకగ్రీవ ఎన్నిక

AKP: రత్నంపేటలో 10వ వార్డు సభ్యుడిగా వైసీపీ బలపరిచిన అభ్యర్థి చీడిపల్లి రాజుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజుబాబుకు అభినందనలు తెలిపారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని రాజుబాబు పేర్కొన్నారు.