హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాజీపేటలో ఉద్రిక్తత.. టీడీపీ నేతకు తీవ్ర గాయాలు

కడప జిల్లా ఖాజీపేట మండలం బి.కొత్తపల్లికి చెందిన టీడీపీ నాయకుడు ముత్తూర్ రఘురామిరెడ్డిపై దాడి జరిగింది. నామినేషన్ వేసేందుకు మిడుతూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాట పెరిగి ఘర్షణకు దారితీయడంతో రఘురామిరెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.