విశాఖపట్నం జిల్లా రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు అయిన ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్‌లోకి నలుగురు విద్యార్థులు స్నానం చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అలలు ఉదృతంగా రావడంతో వాటి దాటికి విద్యార్థి గల్లంతు అయ్యాడు. అప్రమత్తమైన అధికారులు టూరిజం బోట్లు, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు


