SS: పెనుకొండలోని బాబాయ్య స్వామి దర్గా 754 గంధం మహోత్సవం వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత పెనుకొండ శివారులోని 44వ జాతీయ రహదారిపై బైక్ పై వచ్చిన కొందరు యువకులు రేసింగ్ నిర్వహించారు. వాహనాలకు సైలెన్సర్లు తొలగించి భారీగా శబ్ధాలు చేస్తూ అతివేగంగా ద్విచక్ర వాహనాలపై విన్యాసాలు చేశారు. పోలీసులు సంఘటనస్థలికి చేరుకొని రేసర్లను చెదరగొట్టారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ రహదారిపై బైక్ రేసింగ్


