హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు..!

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా జబర్దస్త్ కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు టీమ్ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.