హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

W.G: ఆకివీడు శివారు 165 జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాదు నుంచి భీమవరం వైపు వెళుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ కారు ఆకివీడు వైపు వస్తున్న డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారులోని ఆరుగురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.