హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బోల్తా.. 16 ఏళ్ల బాలుడు మృతి

కర్నూలుకు చెందిన కుటుంబ సభ్యులు శనివారం ఆటోలో కాకులారంలోని ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హైవే అంబులెన్స్‌లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చరణ్ తేజ (16) మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.