హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సముద్రంలో గుర్తుతెలియని మహిళ మృతి!

VSK: తీరానికి దూరంగా నడిసముద్రంలో సుమారు 30–35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. శనివారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ నౌక 'రాణి రష్మోని' సిబ్బంది సముద్రంలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించారు. సిబ్బంది మృతదేహాన్ని జెమిని బోటు ద్వారా ఫిషింగ్ హార్బర్‌లోని జెట్టీ నంబర్ 11కు తరలించారు. అనంతరం వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.