కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన కూతాడి దుర్గ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుడ్లవల్లేరు మండలంలోని గుడ్లవల్లేరు గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమెకు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. అలాగే మొత్తం 16 వార్డు సభ్యుల స్థానాలకు గాను టీడీపీకి చెందిన 12 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
గుడ్లవల్లేరు సర్పంచ్‌గా దుర్గ ఏకగ్రీవ ఎన్నిక


