ఏలూరు స్థానిక కలూరు రోడ్డులోని సుంకరివారితోట సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనం పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇందిరా కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో వాహనాన్ని తప్పించబోయి రాయిని ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం


