ATP: బొమ్మనహాళ్ మండలం నేమకల్లు సర్పంచ్ అభ్యర్థిని కురుబ భాగ్య వినూత్న హామీలు ప్రకటించారు. తాను గెలిస్తే గ్రామంలో జన్మించే ప్రతి ఆడపిల్ల పేరుపై రూ.10 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను రూ.10 బాండ్ పేపర్‌పై రాసి, నోటరీ చేయించి ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వినూత్న హామీ.. ఆడపిల్ల పుడితే రూ.10 వేల FD


