హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ప్రారంభం

PDPL: ప్రభుత్వ మద్దతు ధర కావాలంటే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. నిట్టూరు, నిమ్మనపల్లిలో కేంద్రాలను ప్రారంభించారు. ప్రతి బస్తా 41 కిలోలు ఉండాలని, తేమ నిబంధనలు పాటించాలని, 24 గంటల్లో ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని చెప్పారు. తుఫాను దృష్ట్యా ధాన్యంపై పట్టాలు కప్పాలన్నారు.