హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తర్లుపాడులో 44 సర్పంచ్ నామినేషన్లు

ప్రకాశం: తర్లుపాడు మండలంలో శనివారం మొదటి రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు 44 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు 66 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.