హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ జీవిత భీమా పథకం పేదలకు భరోసా'

MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి జీపీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని స్థానిక సర్పంచ్ మాదరి ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ఒక కవచంలా నిలుస్తుందని అన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు.