NTR: రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కంచికచర్ల మండలంలోని ఎస్.అమరవరం,పెండ్యాల,వేములపల్లి గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ వైవిఎల్ నాయుడు హెచ్చరించారు. ఓటర్లు ధైర్యంగా ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్లలో ఎన్నికల బందోబస్తుకు పోలీసుల కవాతు


