KDP: కాశినాయన మండలం నరసాపురం గ్రామ సర్పంచ్‌గా కర్నాటి సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఏడు వార్డులు, వైసీపీ మద్దతుతో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్‌తో పాటు మొత్తం పది వార్డులకు ఏకగ్రీవ ఎన్నిక జరగడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం సర్పంచ్‌గా సుబ్బమ్మ ఏకగ్రీవ ఎన్నిక


