హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక నిఘా

VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎస్.కోట పి.ఎస్ పరిధిలోని పలు గ్రామాల్లో సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో శనివారం కవాతు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలను ఎటువంటి వివాదాలకు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.