ఖమ్మం: జిల్లాలో కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన డాక్టర్ హలవత్ సుభాష్ చంద్ర అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు. ప్రముఖ 'గ్లోబల్ టెక్ సొల్యూషన్స్' సంస్థలో ఏడాదికి రూ.1.5 కోట్ల భారీ వేతనంతో ఆఫర్ దక్కించుకున్నాడు. మారుమూల తండా నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సుభాష్‌ను తల్లిదండ్రులు సత్యం, ధనలక్ష్మిలతో పాటు గ్రామస్థులు అభినందిస్తున్నారు.
తెలంగాణ
ఖమ్మం తండా యువకుడికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ..!


