హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు బజార్లో పెరిగిన కూరగాయలు ధరలు

కోనసీమ: రావులపాలెం రైతు బజార్లలో ఆదివారం కూరగాయల ధరలు పెరిగినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ వెల్లడించారు. టమాటా రూ.26,  వంకాయలు (నలుపు) రూ.45, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.42, కాకరకాయ రూ.44, బీరకాయ రూ.60గా ఉన్నాయి. బంగాళదుంపలు రూ. 19, ఉల్లిపాయలు రూ.35, చిక్కుడుకాయలు రూ.60,  కొత్తిమీర రూ. 70, బీట్ రూట్ రూ.30,అల్లం రూ.70 పలికినట్లు ఆయన తెలిపారు.