హైదరాబాద్: 28°C
తెలంగాణ

వామ్మో.. భారీ కొండచిలువ

VKB: జిల్లాలోని దోమ మండలంలోని మైలారం గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. స్థానికుడు బోయిని నర్సింహులు పొలంలో కొండచిలువ సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. బోనులో చిక్కిన కొండచిలువను సురక్షితంగా బయటకు తీసి వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం మహమ్మదాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టినట్లు తెలిపారు.