హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీతో పోలీసులకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా?: జేసీ

ATP: తాడిపత్రి ఘర్షణల్లో పోలీసులది ఏకపక్ష వైఖరి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డిపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారని, వైసీపీతో పోలీసులకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? అని ప్రశ్నించారు. తనపై, కుమారుడిపై 307 కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఇద్దరి ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఇకపై తాడిపత్రిలో జరిగే ఘటనలకు ఎస్పీదే బాధ్యతని హెచ్చరించారు.