NZB: సిరికొండ మండలంలో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. తెల్లవారుజాము నుంచే గ్రామాలు, రహదారులు మంచు తెరలతో కప్పుకుపోయాయి. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చల్లటి గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారింది. పొలాలు, చెట్లు మంచు పొరలతో కనువిందు చేశాయి.
తెలంగాణ
VIDEO: పొగమంచుతో కప్పుకున్న సిరికొండ


