హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం ఆదేశాలతో వెనక్కి తగ్గిన అధికారులు

HNK: కాళోజీ కళాక్షేత్రం కళలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలకే వేదికగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కుడా కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేసి మరోచోటుకు తరలించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని ఆదేశించారు. కళాక్షేత్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.