హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపేటలో ధరణి రైస్ మొబైల్ వ్యాన్ ప్రారంభం

కోనసీమ: మండపేట పట్టణంలోని బురుగుంట చెరువు వద్ద ధరణి రైస్ మొబైల్ వ్యాన్‌ను ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ జి. శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ వ్యాన్ ద్వారా కిలో రూ.50కే నాణ్యమైన కేఎన్ఎం బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,300గా నిర్ణయించారు. ఆధార్ నంబర్‌ను ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేసుకుని బియ్యం పొందవచ్చని అధికారులు తెలిపారు.