హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక మాసం ఎఫెక్ట్.. జిల్లాలో తగ్గిన మాంసం ధరలు

ATP: కార్తీక మాసం ప్రభావంతో జిల్లాలో మాంసం ధరలు తగ్గుముఖం పట్టాయి. భక్తులు, ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండటంతో దుకాణాల వద్ద కొనుగోళ్లు మందగించాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ రూ.200 నుంచి రూ.240, మటన్ రూ.750 నుంచి రూ.800, చేపలు రూ.150 నుంచి రూ.300 మధ్య విక్రయిస్తున్నారు. డిమాండ్ లేకపోవడంతో వ్యాపారులు ధరలను తగ్గించారు.