కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు నడిచే ఏసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలపై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ రమాలక్ష్మీదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ ప్రత్యేక రాయితీని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏసీ బస్సు టికెట్లపై 20 శాతం రాయితీ


