హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడులో తోడికోడళ్ల మధ్య పోటీ

పల్నాడు జిల్లా రొంపిచర్ల పంచాయతీ సర్పంచ్ పదవికి తోడి కోడళ్లు పోటీ పడుతున్నారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కూటమి బలపరిచిన బండారు శివలీల, వైసీపీ మద్దతుతో బండారు తిరుపతమ్మ బరిలో నిలిచారు. ఇద్దరు బంధువులు కావడం పంచాయతీలో ఓసి సామాజిక వర్గంఓట్లు అధికంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎవరికి వారే గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు.