హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎరువుల డీలర్ల సర్వసభ్య సమావేశం

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ఎరువుల డీలర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు కంకిపాడు మండలం ఈడుపుగల్లులో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు విజయ కుమార్ తెలిపారు. దీంతో పాటు కార్తీక వనసమారాధన జరుగుతుందని పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక సహా రాష్ట్రానికి చెందిన డీలర్ల సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ  ఉన్నతాధికారులు హాజరు కానున్నారని తెలిపారు.