కోనసీమ: రావులపాలెం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం పొగమంచు అలుముకుంది. తెల్లవారుజాము నుంచే మంచు తెరలు కమ్ముకోవడంతో రహదారులు సరిగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్ల డ్రైవర్లు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు ఇబ్బందులు!


