హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 24న కొట్రకోనలో కార్తీక దీపోత్సవం

గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన మల్లేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 24న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు ధర్మకర్త రామమూర్తినాయుడు, ప్రధాన కార్యదర్శి యుగంధరాచారి తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లక్షదీపార్చన, మహారుద్రాభిషేకం, ఆకాశదీపం, జ్వాలాతోరణం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు.