TPT: ఎస్వీయూ జియాలజీ విభాగం, సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సంయుక్తంగా ఈనెల 24, 25 తేదీల్లో జలవనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నిర్వహించనున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నేపథ్యంలో భూగర్భ జలాల పెంపు, చెరువుల సంరక్షణపై చర్చించనున్నారు. రాయలసీమ తిరుపతి పరిసరాల్లో నీటి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల బాధ్యతపై దృష్టి సారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జలవనరుల పరిరక్షణపై SVUలో జాతీయ సదస్సు


