TPT: నాయుడుపేట మార్కెట్ సెంటర్లో విన్నమాల కాల్వ దాటేందుకు నిర్మించిన కల్వర్టు రక్షణ గోడల్లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. కాల్వ అవతలి నుంచి ఇవతలి వైపునకు వచ్చేందుకు వీలుగా కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఇవి రక్షణ గోడలు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. గోడల్లేక కాల్వలో పడే అవకాశముందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకరంగా కల్వర్టు


