ప్రకాశం: రెండో దశ కింద జిల్లాలోని అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని 198 పంచాయతీలకు వచ్చిన నామినేషన్లకు సంబంధించి శనివారం ఆర్వోల ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. 198 సర్పంచి స్థానాలకు 1,059, 2,014 వార్డులకు 4,209 మంది వేసిన నామినేషన్లను ఆమోదించారు. తిరస్కరణకు గురైన వాటిపై అప్పీళ్ల నిమిత్తం అద్దంకి ఆర్డీవో వద్ద దరఖాస్తు చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
198 సర్పంచి స్థానాలకు 1,059 మంది పోటీ


