హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడి వ్యక్తి మృతి

JN: చిల్పూరు మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన పుల్యాల రాజిరెడ్డి (47) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో శనివారం మృతి చెందాడు. ఈ నెల 17న రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ ప్లాజా వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అవయదానం చేశారు.